పాంపాడ్ విద్యార్థుల ప్ర‌భంజ‌నం

by Ratna Kumari |

మండల కేంద్ర పరిధిలోని మారుమూల ప్రాంతమైన పాంపాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ 9 మంది విద్యార్థులు 10 వ తరగతి పరీక్షలు రాశారు.

పాంపాడ్ విద్యార్థుల ప్ర‌భంజ‌నం
X

దిశ, రాయికోడ్ : మండల కేంద్ర పరిధిలోని మారుమూల ప్రాంతమైన పాంపాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ 9 మంది విద్యార్థులు 10 వ తరగతి పరీక్షలు రాశారు. 9 మంది విద్యార్థులకు 9 మంది 100% ఉత్తీర్ణులై ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. బుధవారం ఫలితాలు విడదలైన ఫ‌లితాల్లో జీ రాజేష్ 546, తులసి 525, అబ్దుల్ కరీం 524, కార్తీక్ 521, సుహన 495, రాహుల్ 474, రాజు 434, దేవ 431, నర్సింహులు 415 మార్కులను సాధించారు. మారుమూల ప్రాంతమైన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సత్తా చాటడంతో ఉపాద్యాయులు, తల్లి తండ్రులు విద్యార్థులకు మిఠాయిలు తినిపించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు సంగీత 100 శాతం ఉత్తీర్ణతపై హర్షం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల తల్లిదండ్రుల‌ సహకారంతో సాధ్యమైందని అన్నారు. విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.

Next Story