పాపన్నపేటలో ముగిసిన పోలింగ్

by Bhanu |   (  Updated:2025-12-11 12:38:50  IST  )

పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1 గంట వరకే ఓటింగ్ ఉండడంతో ఉదయం నుండి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు

పాపన్నపేటలో ముగిసిన పోలింగ్
X

దిశ, పాపన్నపేట: పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1 గంట వరకే ఓటింగ్ ఉండడంతో ఉదయం నుండి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. చలి ప్రభావం అధికంగా ఉండడంతో ఉదయం 9 గంటల వరకు మందకోడిగా సాగింది. ఆ తరువాత క్రమంగా పెరిగింది. పోలింగ్ గడువు ముగిసే సరికి మండలంలో మొత్తం 36,213 ఓట్లకు గాను 31,149 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో మహిళలు 16,333 మంది పురుషులు 14,815 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలం మొత్తంగా 88.90 శాతం ఓట్లు పోలయ్యాయి. మండలంలో అత్యధికంగా శేరిపల్లి గ్రామంలో 96.4 శాతం ఓటింగ్ నమోదు కాగా, అత్యల్పంగా రాజ్యతండా 79.2 శాతంగా నమోదు అయింది. భోజన విరామ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ముందుగా వార్డు సభ్యుల ఫలితాల అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. అంతకుముందు జిల్లా ఎన్నికల పరిశీలకులు భారతి లక్పతి నాయక్ మండల పరిధిలోని కుర్తివాడ, పాపన్నపేట, నార్సింగి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఆమె వెంట జిల్లా ఎన్నికల శిక్షకులు రాజిరెడ్డి, ఎంపీడీఓ విష్ణువర్ధన్, తహసీల్దార్ సతీష్ కుమార్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

READ MORE .....

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Next Story