ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

by Bhanu |   (  Updated:2025-12-11 12:46:21  IST  )

గుమ్మడిదల మండలంలోని ఎనిమిది గ్రామపంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
X

దిశ, జిన్నారం: గుమ్మడిదల మండలంలోని ఎనిమిది గ్రామపంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం పోలింగ్ శాతం 89.42 గా నమోదైంది. కానుకుంట 87.34, అనంతారం 90.27, కొత్తపల్లి 91.12, మంబాపూర్ 85.92, నాగిరెడ్డిగూడెం 94.26, నల్లవల్లి 91.05, రాంరెడ్డిబావి 91.44, వీరారెడ్డిపల్లి 90.03 శాతం నమోదయ్యాయి. మొత్తం 9036 ఓట్లలో 8080 ఓట్లు పోలయ్యాయి. పురుషులు 3894, మహిళలు 4184, ఇతరులు 2 మంది తమ ఓటు హక్కు వినియోగించారు. పోలింగ్ ముగియడంతో వెంటనే లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు.

READ MORE .....

పాపన్నపేటలో ముగిసిన పోలింగ్

Next Story