పీరియడ్స్ అయిన విద్యార్థినికి ఘోర అవమానం.. అందరి ముందు హేళన చేసిన ఉపాధ్యాయుడు

by Muthe.Rajitha |

తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పీరియడ్స్ అయిన విద్యార్థిని పట్ల ఒక ఉపాధ్యాయుడు అత్యంత క్రూరంగా వ్యవహరించిన ఘటన సంచలనం రేపుతోంది.

పీరియడ్స్ అయిన విద్యార్థినికి ఘోర అవమానం.. అందరి ముందు హేళన చేసిన ఉపాధ్యాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పీరియడ్స్ అయిన విద్యార్థిని పట్ల ఒక ఉపాధ్యాయుడు అత్యంత క్రూరంగా వ్యవహరించిన ఘటన సంచలనం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న భోజన విరామం అనంతరం క్లాసులో సదరు బాలిక నుంచి ఏదో వాసన వస్తోందంటూ ఉపాధ్యాయుడు అందరి ముందు అవమానించి, క్లాస్ రూమ్ నుండి బయటకు పంపించి వేశారు. ఉపాధ్యాయుడి నిర్వాకంతో తీవ్ర అవమానానికి గురైన ఆ చిన్నారి, పాఠశాల ముగిసేవరకు తరగతి గది వెలుపలే నిలబడి ఏడ్చింది. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక, ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్తూ కన్నీరు పెట్టుకుంది.

విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. అనంతరం సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సామాజిక కార్యకర్తలు, నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి రాజ్‌మోహన్.. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా సదరు ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story