- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్థరాత్రి దాటినా కొనసాగుతున్న CJP ధర్నా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టు
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చేస్తున్న నిరసన అర్థరాత్రి దాటినా కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చేస్తున్న నిరసన అర్థరాత్రి దాటినా కొనసాగుతోంది. దేశంలో విద్యావ్యవస్థలో, ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న లీకేజీలు, అక్రమాలపై సీజేపీ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే నేతృత్వంలోని ఆందోళనలు ఉదృతం అయ్యాయి. నీట్ (NEET), యుజిసి-నెట్ (UGC-NET) లాంటి పెద్ద పరీక్షలలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ విద్యార్థులు, యువకులు రోడ్లపైకి వచ్చి ఈ భారీ నిరసనల్లో పాల్గొన్నారు. కాగా ప్రశ్నపత్రాల లీకేజికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని యువత గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఇటీవల దేశంలోని వివిధ నగరాల్లో CJP లీడర్ అభిజిత్ దీప్కే నాయకత్వంలో నిరసనలు, ధర్నాలు జరిగాయి. ఈ క్రమంలో శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగింపు నిరసన మరింత వేడెక్కింది. పొద్దుపోయినప్పటికీ కేంద్రమంత్రి రాజీనామాపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో వందలాది మంది విద్యార్థులు, యువకులు జంతర్ మంతర్ రోడ్డు పక్కనే చిన్న చిన్న టెంట్లు వేసుకుని కూర్చున్నారు. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా, నిద్రపోకుండా అక్కడే ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. అయితే ఈ నిరసనను రేపు కూడా కొనసాగిస్తామని విద్యార్థులు, యువత ఆదివారం ఉదయం మరోసారి జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలని అభిజిత్ పిలుపునిచ్చారు. CJP ఆందోళన నేడు కూడా కొనసాగుతుందని స్పష్టం కావడంతో.. మరోసారి యువత భారీ ధర్నాకు సిద్ధం అవుతున్నారు.






