మిట్ట మధ్యాహ్నమే చిమ్మచీకట్లు.. బెంగుళూరులో విచిత్ర వాతావరణం

by Muthe.Rajitha |

బెంగుళూరు వాసులు శనివారం ఆశ్చర్యంతోపాటు షాక్ కు కూడా గురి అయ్యారు.

మిట్ట మధ్యాహ్నమే చిమ్మచీకట్లు.. బెంగుళూరులో విచిత్ర వాతావరణం
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగుళూరు వాసులు శనివారం ఆశ్చర్యంతోపాటు షాక్ కు కూడా గురి అయ్యారు. ఐటీ నగరంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలోనే ఆకాశం మొత్తం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుపోయింది. పగటి పూటే చుట్టూ ఉన్న పరిసరాలన్నీ పూర్తిగా చీకటిగా మారిపోవడంతో, మధ్యాహ్నమే సాయంత్రం 6 గంటలు అయిందా అన్నట్లుగా అనిపించింది. ఈ అసాధారణ వాతావరణ మార్పును చూసి బెంగళూరు నగర ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

చీకటిగా మారిన నగర వీధులను, మబ్బులతో నిండిన ఆకాశాన్ని చూసి చాలా మంది నెటిజన్లు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీశారు. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. “ఇది పగలు కాదు, రాత్రి అనుకున్నాం" అంటూ ఆసక్తికరమైన పోస్టులు పెట్టడంతో ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, అనూహ్యంగా కురిసిన ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులపై నీరు చేరి, కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయినట్లు సమాచారం.

Next Story