- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ జిల్లాలకు బిగ్ రెయిన్ అలర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడనున్నట్టు HMD హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : విదర్భ, చత్తిస్ ఘడ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ విభాగం(HMD) హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసారు అధికారులు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురువనున్నట్టు సమాచారం. ఇక మరోవైపు ఏపీలోనూ నేడు వానలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బాపట్ల, నెల్లూరులో ఓ మోస్తరు వానలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిస్తుందని సమాచారం. అయితే అక్కడక్కడ బలమైన ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం కూడా ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అధికారులు అలర్ట్ చేసారు.






