- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి డాన్ ఇంటిపై బుల్డోజర్స్
హైదరాబాద్ గంజాయి డాన్ నీతుబాయి ఇంటిపై అధికారులు బుల్డోజర్స్ తో విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ గంజాయి డాన్ నీతుబాయి ఇంటిపై అధికారులు బుల్డోజర్స్ తో విరుచుకుపడ్డారు. ఐటీ కారిడార్ లక్ష్యంగా పోలీసులు, ఆబ్కారీ శాఖకు సవాల్ విసురుతున్న గంజాయి వ్యాపారి నీతూబాయి అక్రమ అడ్డాలపై అధికారులు దాడులు ప్రారంభించారు. నానక్‌రాంగూడ లోథాబస్తీలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఒక కిరాణా దుకాణాన్ని, రేకుల షెడ్డును జేసీబీలతో పూర్తిగా కూల్చి వేశారు. సుమారు 20కి పైగా గంజాయి విక్రయ కేసుల్లో ప్రధాన నిందితురాలిగా ఉన్న నీతూబాయి, ఈ కిరాణా దుకాణం అడ్డగానే గంజాయి అమ్మకాలు సాగిస్తోందని గుర్తించిన అధికారులు కఠిన చర్యలకు దిగారు.
కాగా నగరంలో గంజాయి నీతుబాయి ముఠాపై తెలంగాణ ఈగల్ బృందం ప్రత్యేక నిఘా పెట్టి, నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. గత వారం ఆమె నివాసంపై జరిగిన ఆకస్మిక దాడిలో ఏకంగా 47 మంది గంజాయి వినియోగదారులు పట్టుబడగా, నీతూబాయి మాత్రం పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుంది. ఈ కిరాణా దుకాణమే ఆమె అక్రమ విక్రయాలకు కేంద్ర బిందువుగా మారిందని ఈగల్ అధికారులు నిర్ధారించారు. ఈ కూల్చివేతల సమయంలో లోథాబస్తీ సమీపంలోని ఇతర నివాసితులు రోడ్లను ఆక్రమించి చేపట్టిన మరికొన్ని నిర్మాణాలను కూడా అధికారులు తొలగించారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఈ ఆపరేషన్ అంతటా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.






