- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో భారీ వర్షం.. తడిసి ముద్దైన యోగాంధ్రా ఏర్పాట్లు
విశాఖపట్నంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ (యోగాంధ్రా) ఏర్పాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ (యోగాంధ్రా) ఏర్పాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఆర్‌కే బీచ్, ఆర్‌విసి బీచ్, టీమ్ బీచ్‌లతో పాటు పలు ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, అనూహ్యంగా కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురు గాలుల దాటికి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేదికలు, టెంట్లు, కార్పెట్లు, మ్యాట్లు, బ్యానర్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పలుచోట్ల యోగా వేదికలు నీట మునిగాయి.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించాల్సిన ఈ భారీ కార్యక్రమాలపై వాతావరణం తీవ్ర ప్రభావం చూపించింది. ప్రస్తుతం నగరంలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, రానున్న గంటల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, బహిరంగ ప్రదేశాల్లో కాకుండా యోగా కార్యక్రమాలను ఇండోర్ స్టేడియంలలో నిర్వహించాలా, లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.






