రాముని విగ్రహ వివాదం.. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తిన బంగ్లాదేశ్ వీధులు

by Muthe.Rajitha |

బంగ్లాదేశ్‌లో శ్రీరాముని విగ్రహం చుట్టూ ముసురుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

రాముని విగ్రహ వివాదం.. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తిన బంగ్లాదేశ్ వీధులు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో శ్రీరాముని విగ్రహం చుట్టూ ముసురుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గైబంధా జిల్లా పలాశబాడగ్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 82 అడుగుల భారీ రాముని విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఇస్లామిక్ గ్రూపులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అక్కడి హిందూ సమాజం భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చింది. హిందూ సంఘాలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ 'జై శ్రీరామ్' నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.

ఒకవైపు విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఇస్లామిక్ గ్రూపులు పట్టుబడుతుండగా, మరోవైపు విగ్రహ నిర్మాణం నిరాటంకంగా కొనసాగాలని, మైనారిటీలుగా ఉన్న హిందువుల హక్కులను కాపాడాలని హిందూ సంఘాలు దీటుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ ఉదంతం బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీస్తోంది.

Next Story