పోలీస్ వెల్ఫేర్ సొసైటీ పెట్రోల్ పంపు ప్రారంభం

by Naveena |

పోలీస్ పెట్రోల్ పంపు ద్వారా వచ్చే ఆదాయం పోలీస్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది వెల్ఫేర్ కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుందని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, పోలీసు కమిషనర్ డాక్టర్ బీ అనురాధ అన్నారు.

పోలీస్ వెల్ఫేర్ సొసైటీ పెట్రోల్ పంపు ప్రారంభం
X

దిశ,సిద్దిపేట అర్బన్ : పోలీస్ పెట్రోల్ పంపు ద్వారా వచ్చే ఆదాయం పోలీస్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది వెల్ఫేర్ కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుందని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, పోలీసు కమిషనర్ డాక్టర్ బీ అనురాధ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో.. నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును కలెక్టర్ మను చౌదరి,పోలీస్ కమిషనర్ అనురాధ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ పెట్రోల్ పంపులో డీజిల్/ పెట్రోల్ ఎలాంటి కల్తీ లేకుండా క్వాలిటీ క్వాంటటీగా ఉంటుందని తెలిపారు. ప్రజలు సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. పోలీస్ కన్వెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా పోలీసు వెల్ఫేర్ సొసైటీకి వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, సతీష్, రవీందర్, రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు విష్ణు ప్రసాద్, రాజేష్ ఐఓసీ సీనియర్ మేనేజర్ కోసూరి శ్రీనివాస్, అమిత్ కుమార్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story