- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ చెత్త నువ్వే ఎత్తు..!
సంగారెడ్డి పట్టణంలో కొందరికి "చెత్త శుద్ధి" లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ పారవేస్తున్నారు. దీనిపై విసుగు చెందిన మున్సిపల్ శాఖ అధికారులు వినూత్న శిక్షకు నడుం బిగించారు.

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలో కొందరికి "చెత్త శుద్ధి" లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ పారవేస్తున్నారు. దీనిపై విసుగు చెందిన మున్సిపల్ శాఖ అధికారులు వినూత్న శిక్షకు నడుం బిగించారు. ఎక్కడైతే చెత్తను రోడ్డుపై పారేశారు వారిని నేరుగా పిలిపించి వారితోనే దానిని తీయిస్తున్నారు. ఈ దృశ్యాలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ రోజు వెలుగు చూసింది. చెత్త బయట వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా షాప్ యజమానులు వినకపోవడంతో మున్సిపల్ అధికారులు విసుగు చెంది ఈ కొత్త పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్లు పట్టణంలోని అన్ని రోడ్లు కలియ తిరుగుతూ రోడ్డుపైన చెత్త వేసే షాపు యజమానులతో నే అదే చెత్తను తీసి క్యారీ బ్యాగ్ లలో వేయించారు. మాట వినకపోతే భారీ మొత్తంలో పెనాల్టీలు కూడా విధిస్తామంటూ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రజలను హెచ్చరిస్తున్నారు. అదే విధంగా విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు పారిశుధ్యం కూడా దెబ్బతింటుందని గ్రహించి వ్యాపారస్తులందరికీ ప్లాస్టిక్ వాడకుండా అవగాహన కూడా కల్పిస్తున్నారు. వీధి వ్యాపారులు అదే విధంగా షాప్ యజమానులు ప్లాస్టిక్ బదులుగా బట్ట సంచి వాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






