- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పటాన్ చెరుకు సబ్ రిజిస్టర్ కార్యాలయం..!
పటాన్ చెరు లో కార్యాలయ ఏర్పాటు చేయాలంటూ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఇన్ స్పెక్టర్ జనరల్ కు ఆదేశాలు జారీ చేశారు.

దిశ, పటాన్ చెరు : ఎట్టకేలకు పటాన్ చెరు లో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గత రెండేండ్లుగా హై కోర్టులో ఉన్న న్యాయ పరమైన చిక్కులు తొలగిపోయాయి. పటాన్ చెరు లో కార్యాలయ ఏర్పాటు చేయాలంటూ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఇన్ స్పెక్టర్ జనరల్ కు ఆదేశాలు జారీ చేశారు. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పటాన్ చెరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 30 ని జారీ చేశారు. ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సంగారెడ్డి నుంచి తరలింపు పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హై కోర్ట్ ను ఆశ్రయించారు. దీంతో అప్పట్లో పటాన్ చెరు లో కార్యాలయం ఏర్పాటు పై హై కోర్ట్ స్టే విధించింది. జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సంగారెడ్డి లో కొనసాగేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, పటాన్ చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పటాన్ చెరు లో ఏర్పాటు చేయాలని వాదనలు సాగాయి. ఈ వాదనలతో ఏకీభవించిన గౌరవ హైకోర్టు పటాన్ చెరువులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం త్వరలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ కార్యాలయం ఏర్పాటు అయితే పటాన్ చెరు, అమీన్ పూర్, రామచంద్రపురం ప్రజలకు ప్రయాణభారం తగ్గడంతో పాటు సమయం, డబ్బులు ఆదా కానున్నాయి.
నా కృషి ఫలించింది: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
2018 ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్ చెరు లో కి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 2023లో పటాన్ చెరు కు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మంజూరు చేస్తూ జీవో 30 జారీ చేశారు. అందులో ఎస్ఆర్ఓ కార్యాలయం తో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పటాన్ చెరు లో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొందరు జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయ తరలింపును వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో పటాన్ చెరు సబ్ రిజిస్టర్ కార్యాలయ ఏర్పాటు పెండింగ్లో పడింది. రెండేళ్లపాటు హైకోర్టులో న్యాయపోరాటం కొనసాగించి ఎట్టకేలకు పటాన్ చెరు లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయన్ని సాధించుకున్నాం. త్వరలో పటాన్ చెరు లో పాత తహసిల్దార్ కార్యాయంలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. కార్యాలయానికి శాశ్వత భవన నిర్మాణానికి ఐదు ఎకరాలు కేటాయించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. త్వరలో ఆ దిశగా చర్యలు తీసుకొని శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని వివరించారు.






