Pashamylaram : పాశమైలారం ఘటన... శిథిలాల కింద మరో రెండు మృతదేహం లభ్యం

by Muthe.Rajitha |

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్‌ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్‌ పేలిన(Reactor Exploded) సంగతి తెలిసిందే.

Pashamylaram : పాశమైలారం ఘటన... శిథిలాల కింద మరో రెండు మృతదేహం లభ్యం
X

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్‌ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్‌ పేలిన(Reactor Exploded) సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 100 పైగా మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదస్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగా.. శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య 14 కు చేరింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో బాయిలర్ లో ఎయిర్ ప్రెషర్ పెరగడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్ పేలిపోయింది.

పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. రియాక్టర్ ఛాంబర్ భవనం కుప్పకూలగా.. మరో భవనం బీటలు వారింది. ప్రమాద స్థలిలో కార్మికుల మృతదేహాలు గుర్తు పట్టలేనంత చెల్లాచెదురయ్యాయి. కార్మికుల కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లి పోయింది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల్లో అనేక మంది పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా రేపు ప్రమాదస్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి, బాధిత కుటుంబాలను పరమర్శించనున్నారు.

Next Story