దేవులపల్లి రాయిలాపూర్ గ్రామాలను సందర్శించిన పంచాయతీరాజ్ జిల్లా ప్రత్యేక అధికారి

by Taduka Kalyani |

మెదక్ జగిత్యాల జిల్లాల పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి జాయింట్ కమిషనర్ (జేసీఆర్డీ అడ్మిన్) విజయరావు గురువారం మండలంలోని దేవులపల్లి, రాయిలాపూర్ గ్రామాల్లో పర్యటించారు.

దేవులపల్లి రాయిలాపూర్ గ్రామాలను  సందర్శించిన పంచాయతీరాజ్ జిల్లా ప్రత్యేక అధికారి
X

దిశ, కౌడిపల్లి: మెదక్ జగిత్యాల జిల్లాల పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి జాయింట్ కమిషనర్ (జేసీఆర్డీ అడ్మిన్) విజయరావు గురువారం మండలంలోని దేవులపల్లి, రాయిలాపూర్ గ్రామాల్లో పర్యటించారు. 15వ ఆర్థిక సంఘం,2025-26 ఆర్థిక సంవత్సరం కు సంబంధించిన నిధుల రికార్డులను పరిశీలించారు. పంచాయతీకి సంబంధించిన ఆదాయ వ్యయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామాలలో తిరుగుతూ ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. మురుకలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. వనమహోత్సవంలో భాగంగా దేవులపల్లి పంచాయతీ పరిధిలోని కోమటికుంట తండాలో మొక్కలు నాటారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఈవో స్వప్న, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, డీఎల్పీఓ సురేష్ బాబు, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రామారావు, సర్పంచులు తిరుపతి రెడ్డి, స్వప్న, పంచాయతీ కార్యదర్శులు అఖిల్, నగేష్, ప్రవీణ్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story