మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి

by velandi.Saikiran |

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు.

మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
X

దిశ, కొమురవెల్లి : సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలుకు గాయమై ఇటీవల కోలుకున్నారు.కోలుకున్న తర్వాత మొదటగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు వారు తెలిపారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయనికి వచ్చిన ఎమ్మెల్యేకు అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రములు, ఆశీర్వచనం అందజేశారు. అంతకుముందు కొమురవెల్లి కమాన్ రాజీవ్ రహదారి నుంచి కార్యకర్తల భారీర్యాలీతో ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గీత బిక్షపతి, మాజీజడ్పిటిసి సిలువేరు సిద్ధప్ప, మాజీ ఎంపీపీ కీర్తన కిషన్ నాయకులు గొల్లపల్లి కిష్టయ్య, మెరుగు కృష్ణ, బొంగు రాజేందర్ రెడ్డి, ముత్యం నర్సింలు, ఏర్పుల మహేష్, కొండా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story