- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లస్సీ వాటర్‌లో మూత్రం కలపడానికి యత్నించిన యజమాని
లస్సీలో కలిపే వాటర్‌లో మూత్రం కలపడాన్ని చూసిన టైలర్, ప్రశ్నించగా బాలుడు అక్కడినుంచి పరారయ్యాడు.

దిశ, నర్సాపూర్: నర్సాపూర్ పట్టణంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడు లస్సీలో కలిపే నీటిలో మూత్రం పోస్తుండగా మధు అనే టైలర్ గమనించాడు. వివరాల్లోకి వెళ్తే... నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఓ వ్యాపారి లస్సీ బండి నడుపుతున్నాడు. అందులో పని చేసే ఓ బాలుడు లస్సీలో కలపడానికి నీటి కోసమని సమీపంలోనీ హనుమాన్ ఆలయం వద్దగల నల్ల వద్దకు వచ్చాడు. నల్ల నుండి నీటిని తీసుకొని అందులో మూత్రం పోస్తుండగా ఆ గల్లీలో పనిచేస్తున్న మధు అనే టైలర్ గమనించి బాలుడిని మందలించానని మధు పేర్కొన్నాడు. అక్కడున్న స్థానికులు సైతం బాలుడిని మందలించడంతో నీరు పారబోసి వెళ్లిపోయాడని వెల్లడించారు.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
వెంటనే అక్కడున్న స్థానికులు లస్సీ యజమాని వద్దకు వెళ్లి నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకు సమాధానం చెప్పలేక దుకాణ యజమాని దుకాణం మూసివేసుకొని పరారయ్యాడు. ఈ విషయంపై ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డిని వివరణ కోరగా బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించామని తెలిపారు. తను అందులో పని చేయడం లేదని, లస్సీ యజమాని నీళ్లు తీసుకురమ్మని చెబితే నల్ల వద్దకు వెళ్లానని, మూత్రం రావడంతో అక్కడ పోస్తుండగా అందులో పడగా పారబోశానని బాలుడు చెబుతున్నాడని అన్నారు. విచారణ చేపట్టి పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి వివరించారు. ఇలాంటి దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






