చౌటకూర్ మండలంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం ప్రారంభం

by Nallavelli.Anjaneyulu |

దిశ, చౌటకూర్ : చౌటకూర్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఈజీఎస్) కార్యాలయాన్ని

చౌటకూర్ మండలంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం ప్రారంభం
X

దిశ, చౌటకూర్ : చౌటకూర్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఈజీఎస్) కార్యాలయాన్ని శ‌నివారం అదనపు డీఆర్ డీఓ బాలరాజు రైతు వేదిక వద్ద ప్రారంభించారు. ఈ కార్యాలయం పుల్కల్ మండలం నుంచి విడిపోయి చౌటకూర్ మండలంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాశ బోయిన సురేఖ అనే అభ్యర్థికి ఇందిరమ్మ ఇల్లు మార్కౌట్ అందజేయడం జరిగింది. అనంతరం అదనపు డీఆర్డీవో పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీడీవో కే. శంకర్, ఎమ్మార్వో కిష్టయ్య, ఎంపీ ఓ సువర్ణ, పంచాయతీ రాజ్ డిప్యూటీ జి. కృష్ణ, ఏఈ పి ఆర్ శశి కుమార్, ఏపీవో రాజ్ కుమార్, టిఏలు సతీష్, రమేష్, ఈసీ మహేశ్వర్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ భవాని, కార్యాలయ సిబ్బంది మహేశ్వర్ రెడ్డి, శైలజ, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు,చౌటకూర్ మండల కాంగ్రెస్ నాయకులు సుభాష్ రెడ్డి, రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, రామ్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story