ఆహా ఏమి రుచి.. ఉత్సాహంగా 'ఫుడ్ ఫెస్టివల్

by Naveena |

ఆహా ఏమి.. రుచి అనరా మైమరచి... అనే విధంగా సర్కారీ బడిలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.

ఆహా ఏమి రుచి.. ఉత్సాహంగా ఫుడ్ ఫెస్టివల్
X

దిశ,ఝరాసంగం :ఆహా ఏమి.. రుచి అనరా మైమరచి... అనే విధంగా సర్కారీ బడిలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో.. ఇంటి వద్ద తయారు చేసుకొచ్చిన రుచికరమైన వంటలు ప్రదర్శించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు, ఉపాధ్యాయ కలిసి ఫుడ్ ఫెస్టివల్ ను ఉత్సాహంగా నిర్వహించారు. 7,8,9 వ తరగతి విద్యార్థులు సుమారు 70 మంది 50 రకాల వంటకాలు తీసుకొచ్చారు. పులిహోర, బిర్యానీ, వెజ్ బిర్యానీ, బచ్చాలు, ఇడ్లీలు, బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలు, పూరీలు, చపాతీలు, జొన్న రొట్టెలు, లడ్డులు, బోండాలు, దోశలు, జిలేబి, 12 రకాల చట్నీలు, పాపడు, మజ్జిగ, పెరుగు, 8 రకాల గుడాలు తదితర వంటకాలతో పాఠశాల ఆవరణం గుమగుమలాడింది. విద్యార్థులు తీసుకొచ్చిన వంటలతో పాఠశాలలో చదువుతున్న సుమారు 213 మంది విద్యార్థులకు భోజనాల అందించారు. పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుత. ఆహారపు అలవాట్ల వాటిలో ఉండే పోషక విలువలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులు లక్ష్మి, జయశ్రీ, రాధిక, అనిత, సుగుణ, నరసింహారెడ్డి, రమేష్, జైపాల్, ఉత్తం కౌర్, పి. అనిత, ఇమ్మానియేల్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story