- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెట్రోల్ బంక్ లో తనిఖీలు...
by Batti.Sumithra |
పెట్రోల్ లో నీళ్ళు వచ్చాయని దిశలో వచ్చిన కథనం పై ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ స్పందించింది.

X
దిశ, మెదక్ ప్రతినిధి : పెట్రోల్ లో నీళ్ళు వచ్చాయని దిశలో వచ్చిన కథనం పై ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ స్పందించింది.. ఈ నెల 22 న మెదక్ పట్టణానికి చెందిన యాదగిరి పెట్రోల్ పోసుకొని వెళ్లగా అందులో నీళ్లు వచ్చాయని రాధా కృష్ణ పెట్రోల్ పంపు వద్ద ఆందోళన చేశారు. పెట్రోల్ కల్తీ జరిగిందని పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అసిస్టెంట్ అన్వేష్ బంక్ లో తనిఖీలు నిర్వహించారు.
బాధితుడు యాదగిరి ఆధ్వర్యంలో పెట్రోల్ తనిఖీ చేశారు. అందులో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షలు చేసి చూపించారు. అన్నీ పరీక్షలు నిర్వహించామని, అందులో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చి చెప్పారు. ప్రతి రోజు పరిశీలించిన తరవాతే విక్రయాలు సాగిస్తామని, పెట్రోల్ లో ఎలాంటి కల్తీ లేదని నిర్ధారించారు.
Next Story






