నామినేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా నిర్వ‌హించాలి : క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, అల్లాదుర్గం : గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరిస్తూ మెదక్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు

నామినేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా నిర్వ‌హించాలి :  క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్
X

దిశ, అల్లాదుర్గం : గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరిస్తూ మెదక్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్ లు జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 06మండలాలైన అల్లాదుర్గం, రేగోడు, టేక్మాల్, హవేలీ గన్పూర్, పాపన్నపేట, శంకరంపేట ఆర్, 160 సర్పంచ్, 1402వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో అల్లాదుర్గం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం ఆకస్మికంగా సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు.

నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా..? అని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్ లను ఏ రోజుకు ఆ రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ మల్లయ్య, ఎంపీడీఓ వేద ప్రకాష్ రెడ్డి, పంచాయతి కార్యదర్శులు పాల్గొన్నారు.

Next Story