సిగాచీ యాజమాన్యంపై NMDA ఆగ్రహం

by Muthe.Rajitha |

సంగారెడ్డి జిల్లా(Sangareddy)లోని పాశమైలారం(PashaMylaram)లోని పారిశ్రామికవాడలో సిగాచీ(Sigachi) ఫాక్టరీని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(NMDA) బృందం నేడు పరిశీలన చేసింది.

సిగాచీ యాజమాన్యంపై NMDA ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా(Sangareddy)లోని పాశమైలారం(PashaMylaram)లోని పారిశ్రామికవాడలో సిగాచీ(Sigachi) ఫాక్టరీని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(NMDA) బృందం నేడు పరిశీలన చేసింది. ప్రమాదం జరిగిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. పేలుడుకు గల కారణాలను బృందం అధ్యయనం చేసింది. అనంతరం అక్కడే సమావేశం నిర్వహించింది. కంపెనీ నిర్వహణ లోపాలపై NMDA ప్రశ్నల వర్షం కురిపించింది. వాటిపై సంస్థ అధికారులు సరిగ్గా స్పందించక పోవడంపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒక రసాయన పరిశ్రమ నిర్వహణ గురించి తమకు అంతా తెలుసని, పేలుడు ఎలా జరిగిందో చెప్పాలని మండి పడింది. పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది. కాగా సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 44 మంది మరణించగా.. మరికొంతమంది ఆచూకీ లేకుండా పోయింది.

Next Story