సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి

by Naga Rani Yarlagadda |

సిద్ధిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె భర్త తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్ధిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె భర్త తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే వీరిద్దరికీ వివాహం జరగ్గా.. మృత్యువు వారిద్దరినీ విడదీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల శివారులో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రణతి (24), సాయికుమార్ లు ఉద్యోగం నిమిత్తం సిద్ధిపేట నుంచి టూవీలర్ పై హైదరాబాద్ కు పయనమవ్వగా.. ట్రాక్టర్ అదుపు తప్పి వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. అంబులెన్సులో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రణతి దారిలోనే మృతి చెందింది. సాయికుమార్ కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నవ దంపతుల జీవితంలో జరిగిన ఈ విషాద ఘటన.. ఇరు కుటుంబాలతో పాటు గ్రామస్తులచే కంటతడి పెట్టించింది.

Next Story