- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్కీ డ్రా..లాటరీ పేరుతో నయా దందా
లక్కీ డ్రాల పేరుతో రోజుకో చోట మోసాలు జరుగుతునే ఉన్నాయి. డబ్బు సంపాదించాలనే దురాలోచనతో పేదలను మోసం చేస్తూనే ఉన్నారు.

దిశ, దుబ్బాక: లక్కీ డ్రాల పేరుతో రోజుకో చోట మోసాలు జరుగుతునే ఉన్నాయి. డబ్బు సంపాదించాలనే దురాలోచనతో పేదలను మోసం చేస్తూనే ఉన్నారు. మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేసేవారు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎక్కడో ఒక చోట లక్కీ లాటరీలు నడిపేవారు దొరుకుతూనే ఉన్నారు. కానీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. లక్కీ డ్రా స్కీం పేరుతో రియల్ ఎస్టేట్ నయా దందా తెరలేపుతోంది. లక్షలు విలువ చేసే ప్లాటును కేవలం రూ.1999 లకే 185 గజాల ప్లాటు సొంతమంటూ సోషల్ మీడియాలో వేదిక చేసుకుని వాట్సాప్ గ్రూపులలో ఫ్లెక్సీలతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తతంగాన్ని స్థానిక కాంగ్రెస్ నేత ముందుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని అమాయకులైన గ్రామీణ ప్రాంత ప్రజలనే టార్గెట్ చేసుకొని ధనార్జన ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు. లక్కీ డ్రా స్కీం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల లక్కీ డ్రా నిర్వహిస్తున్న వ్యక్తులపై కేసులైన సందర్భాలున్నాయి. చట్ట ప్రకారం లక్కీ డ్రా స్కీములతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై మండల పరిధిలోని అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్లాట్ కావాలనుకునే వారికి సువర్ణ అవకాశమంటూ ఫ్లెక్సీ...
185 గజాల ప్లాటు అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో సిద్దిపేట రామాయంపేట నేషనల్ హైవే 765 డీజికీ అతి సమీపంలో గల భూంపల్లికి వెళ్లే రోడ్డులో గల ప్రాథమిక పాఠశాల పక్క గల్లీలో కలదంటూ, ఆసక్తి ఉన్నవారు రూ,1999 లతో కూపన్ కొనుగోలు చేసి లాటరీ ద్వారా పొందగలరు అంటూ ఆన్లైన్ ద్వారా కూపన్ కొనుగోలు చేయాలనుకుంటే వేంటనే పోన్ 9346534914 నంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, చేసి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీ కూపన్ మీయొక్క పోన్ వాట్సాప్ కి పంపియడం జరుగుతుందని ఫోటోను డ్రా టైం లో చూపించగలరని ఫ్లెక్సీలు, పోస్టర్లు తో సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేస్తున్న వారిపై దృష్టి పెట్టలేకపోతున్నారు.మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అందరికీ తెలుసు. చాలీచాలని జీతంతో కుటుంబం బాధ్యతలు మోస్తూ.. చాలా కష్టంగా తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వీళ్లందరూ తమ తలరాతను మార్చే అదృష్ట ఘడియల కోసం ఎల్లప్పుడూ వేచి చూస్తుంటారు. వాళ్ల ఈ అవసరాన్నే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రజలు మోసగాళ్ల మాటలకు మోస పోవద్దు... కష్టపడితేనే ఫలితం వస్తుంది.. అలాంటిది లక్కీగా ప్లాట్, డబ్బులు వస్తాయని ఆశపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. ఇలాంటి లక్కీ లాటరీలను నమ్మవద్దు అని పోలీసులు హెచ్చరిస్తున్న లక్కీ డ్రా నిర్వహకుల్లో మార్పులు రావడం లేదు. వీరిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
లక్కీ డ్రా స్కీం నిబంధనలు ఎక్కడ.?
రియల్ ఎస్టేట్ వ్యాపారి నిబంధనలు లెకుండా లక్కీ డ్రా స్కీం పెట్టి ప్రజలను మోసం చేస్తున్నాడు. తాను లక్కీ డ్రా స్కీం ద్వారా తన ఫ్లాట్ ను విక్రయించాలి అనుకున్నట్లయితే చట్టపరమైన నిబంధనలు పెట్టుకొని ప్లాట్లను విక్రయించుకోవాలి. లక్కీ డ్రా ద్వారా ఎన్ని కూపన్లు పెట్టుకున్నాడు. తాను నిర్ణయించుకున్న తేదీ వరకు తక్కువ కూపన్లు వస్తే ఎలా..? కూపన్లు కట్టిన వారికి తిరిగి వారి డబ్బు చెల్లిస్తాడా.! లేదా.! డ్రా తీయు తేది వరకు 100 మంది అయితే వంద మందికే డ్రా తీస్తాడా.! లేదా తను అనుకున్నంత కూపన్లు వచ్చే వరకు తేదీ మారుస్తాడా..! అనే నిబంధనలు ఎక్కడ.!






