- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగారెడ్డి కాంగ్రెస్ లో కొత్త రథసారథులు
సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కొత్త రథసారథులను తిరుమల జగ్గారెడ్డిలు ప్రకటించారు.

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కొత్త రథసారథులను తిరుమల జగ్గారెడ్డిలు ప్రకటించారు. ఏఐసీసీ సూచనల మేరకు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ల ఆదేశాల మేరకు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్లాక్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ లను మార్చాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించడానికి ప్రతిపాదనలను డీసీసీ అధ్యక్షురాలు నిర్మలకు పంపారు.
కొత్త నాయకులు వీరే..
సంగారెడ్డి బ్లాక్ ప్రెసిడెంట్ గా జార్జ్ మాథ్యూస్ (సంగారెడ్డి టౌన్, కంది మండలం, సంగారెడ్డి మండలం) ప్రకటించారు. అలాగే సదాశివపేట బ్లాక్ ప్రెసిడెంట్ గా చాట్ల సిద్దన్న ( కొండాపూర్ మండలం, సదాశివపేట టౌన్, సదాశివపేట మండలం), సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ గా ఆర్. కిరణ్ గౌడ్, సంగారెడ్డి మండల ప్రెసిడెంట్ గా ఎం.డీ ఖలీల్ ల పేర్లను ప్రతిపాదించారు. కంది మండల ప్రెసిడెంట్ గా బి. మొగులయ్య, కొండాపూర్ మండల ప్రెసిడెంట్ పి.మల్లారెడ్డి, సదాశివపేట టౌన్ ప్రెసిడెంట్ గా పి. నాగరాజు గౌడ్, సదాశివపేట మండల ప్రెసిడెంట్, ఒగ్గు శ్రీనివాస్ లు ఎన్నుకోబోతున్నట్లు ప్రకటించారు.






