- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేషనల్హైవే పనులు నాసిరకం
ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండాలని రోడ్లు కొన్నేళ్ల పాటు పటిష్టంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఖర్చు చేస్తే కాంట్రాక్టర్, అధికారులు కుమ్మక్కై బుడిగరాళ్లు, మొరం, నల్లమట్టితో నాసీరకంగా నిర్మిస్తున్నారు.

దిశ, నారాయణఖేడ్ : ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండాలని రోడ్లు కొన్నేళ్ల పాటు పటిష్టంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఖర్చు చేస్తే కాంట్రాక్టర్, అధికారులు కుమ్మక్కై బుడిగరాళ్లు, మొరం, నల్లమట్టితో నాసీరకంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు అనుసంధానం చేస్తూ నిజాంపేట నుంచి నారాయణఖేడ్ , మనూర్, చల్కి , న్యాల్కల్, డప్పు మీద కర్ణాటకలోని బీదర్ వరకు 80 కి.మీలుగా ఉన్న జాతీయ రహదారుల విభాగం, రోడ్డు భవనాల శాఖ పరిధిలో ఉన్న రోడ్డు నాలుగేళ్ల కిందట జాతీయ రహదారిగా గుర్తించారు. జాతీయ రహదారి హోదా రావడంతో రోడ్డు భవనాల శాఖ 80 కిలోమీటర్ నుంచి 49.946 రోడ్డును తగ్గించారు. 2021 సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక (డీపీ ఆర్) కేంద్ర ప్రభుత్వానికి సిద్ధం చేసి పంపారు. అంచనా వేసిన సమగ్ర ప్రాజెక్టు నిధులు సరిపోకపోవడంతో కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రోడ్డుకు రూ.512.98 కోట్లు నిధులు మంజూరు చేశారు.
జాతీయ రహదారి రెండు వరుసల రోడ్డు నిర్మాణం 33 ఫీట్ల తారు రోడ్డు, 100 ఫీట్ల రోడ్డు, నారాయణఖేడ్ పట్టణంలోని రాయిపల్లి రోడ్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జి, అవసరమున్న చోట కల్వర్టు, పులుకుర్తి, మంజీరా నది మధ్యన టోల్ గేట్ నిర్మించాలని అంచనా వేశారు. నారాయణఖేడ్ నుంచి బీదర్ వరకు జాతీయ రహదారి పనులు జరుగుతున్నప్పటికీ అవి నత్తనడకన నాసీరకం పనులు చేస్తున్నారు. రోడ్డుకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో వాహన చోదకులు రోజు నరకయాతన పడుతున్నారు. నల్ల మట్టి వేయడంతో బురదతో వాహనాలు వెళ్లడం కష్టంగా మారిందని వాహనదారులు అధికారులకు, కాంట్రాక్టర్లకు తెలిపిన పట్టించుకోవడంలేదని వాపోయారు. బొడిగరాళ్లు రోడ్డుపైన పోయడంతో ఏమాత్రం చిన్నపాటి వర్షం కురిసిన వేసిన రోడ్డు గుంతలుగా ఉండడంతో వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. జగన్నాథ్ పూర్ నుంచి న్యాల్కల్ వరకు రాళ్లను రోడ్డుపై పరిచారు. కానీ నాణ్యతను మర్చిపోయారు.
గుంతలు తీసి వదిలేశారు..
నిజాంపేట -నారాయణఖేడ్ 15 కిలోమీటర్ రోడ్డు పనులు గుంతలు తీసి వదిలేశారు. నిజాంపేట- బీదర్ రహదారి మార్గంలో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. మరోవైపు జాతీయ రహదారి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు నిత్యం దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి రోడ్డు నిర్మాణంలో నారాయణఖేడ్ నుంచి బీదర్ వరకు నేషనల్ హైవే రోడ్డు పనులు నాసీరకంగా నల్ల మట్టి ఉండడంతో నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదు. నారాయణఖేడ్ నుంచి బీదర్ వరకు 49.946 కిలోమీటర్లు రోడ్డును, గత నెల మార్చి 2024 క్రితం పనులు ప్రారంభం కాగా,2026 మార్చి లోపు పూర్తి చేయాలి. ఒక మంజీరా నదిపై నే ఒక సంవత్సరం పాటు బ్రిడ్జి నిర్మాణ చేయవలసి ఉంది. మంజీరా నది నిండుకుండలా ఉన్నప్పటికీ నదిపై బ్రిడ్జినిర్మాణం సంవత్సరం పాటు జరగవలసి ఉంటుంది.
నదిపై డైరింగ్ జరగలేదు. మనూరు మండలంలోని బెల్లాపూర్ , పులుకుర్తి రైతులకు, భూమి కోల్పోయిన రైతులకు ఇంకా చాలామంది ఆర్థిక సాయం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తిరుగుతున్న ఇప్పటివరకు ఆర్థిక సాయం అందడం లేదని వాపోయారు. అవసరాన్ని బట్టి రోడ్డుకు ఇరువైపులా రెండు నుంచి ఆరు ఫీట్ల వరకు తవ్వించి మొరంతో లెవలింగ్పనులు జరుగుతున్న పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక్కడ అసలే నల్ల మట్టిభూములు-ఏమాత్రం వర్షం కురిసిన కుంగి పోతుంటాయి. ఖేడ్ -డప్పుర్ మధ్యన రోడ్డు వేసిన మూన్నాళ్లకే శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన మెటీరియల్ ను వాడవలసిన కాంట్రాక్టర్లు బొడిగ రాళ్లు, నాసిరక మైన మట్టిని వినియోగిస్తూ ఉండడం పై రోడ్డు శిథిలావస్థలకు చేరుకుంటుందని ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు.






