- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారాయణఖేడ్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. కాంగ్రెస్ కార్యకర్తలు
నారాయణఖేడ్ కాంగ్రెస్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. సురేష్ శెట్కర్ అనూహ్య నిర్ణయం తీసుకుని పార్టీ తనకు ఇచ్చిన బీ ఫామ్ ను సంజీవరెడ్డికి ఇచ్చారు.

దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ కాంగ్రెస్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. సురేష్ శెట్కర్ అనూహ్య నిర్ణయం తీసుకుని పార్టీ తనకు ఇచ్చిన బీ ఫామ్ ను సంజీవరెడ్డికి ఇచ్చారు. దీంతో నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ పట్లోల సంజీవరెడ్డికి ఎట్టకేలకు ఖరారు అయింది. టీపీసిసి ఉపాధ్యక్షుడు పట్లోల సంజీవరెడ్డి నామినేషన్ వేయడంతో నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలతో జనసముద్రమైంది. సంజీవరెడ్డి గెలుపు ఖాయమని ఇప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు.
ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న సంజీవరెడ్డికి టికెట్టు రాకపోవడంతో నిరాశలో ఉన్న, కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం సురేష్ షెట్కర్ సంజీవరెడ్డి ఒక్కటి కావడంతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య ఉండడంతో యువకులు భారీ ఎత్తున తరలివచారు. రెండు మార్లు కాంగ్రెస్ ఓడిపోవడంతో ఈ సారైనా సంజీవరెడ్డిని గెలిపించాలని నారాయణఖేడ్ కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు.






