- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుస్నాబాద్‌లో ఆరు దుకాణాలపై మున్సిపల్ కొరడా!
by Taduka Kalyani |
పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ వాడకం పై మున్సిపల్ అధికారులు విరుచుకుపడ్డారు. కమిషనర్ టి. మల్లికార్జున్ ఆదేశాలతో సానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు.

X
దిశ, హుస్నాబాద్: పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ వాడకం పై మున్సిపల్ అధికారులు విరుచుకుపడ్డారు. కమిషనర్ టి. మల్లికార్జున్ ఆదేశాలతో సానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరు దుకాణాలపై కొరడా ఝుళిపించి, రూ.6,000 జరిమానా విధించారు. మైసూర్ బేకరీ కి రూ.1,500, రాజస్థాన్ ఆశా పూరి స్వీట్ హౌస్, ఎస్.ఎల్.వి బెంగళూరు బేకరీ, రాందేవ్ జనరల్ స్టోర్స్, హనుమాన్ జనరల్ స్టోర్స్‌లకు రూ.1,000 చొప్పున, ఆర్ఎస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు రూ.500 జరిమానా విధించారు. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే ఊపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవి కుమార్, జవాన్ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






