- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సంస్కృతికి ప్రతీక మొహర్రం
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, గంగా జమున తెహజీబ్ సంస్కృతికి మొహర్రం ప్రతీక అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

దిశ, పటాన్ చెరు టౌన్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, గంగా జమున తెహజీబ్ సంస్కృతికి మొహర్రం ప్రతీక అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మొహర్రం పర్వదినం పురస్కరించుకొని జీఎంఆర్ యువసేన నాయకులు షకీల్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..త్యాగ నిరతికి, సహనానికి ప్రతీక మొహర్రం, పీర్ల రూపంలోని అమరవీరుల సంస్మరణం.. అన్ని మతాల ఐక్యతకు సఖ్యతకు చిహ్నం మొహర్రం అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, వెంకటేష్, మిరాజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.






