‘అధికారంలోకి రావడానికి మెట్టు దూరంలో ఉన్నాం’: ఎంపీ రఘునందన్ రావు

by Kodari Anjali |   (  Updated:2026-05-02 15:19:31  IST  )

అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రధాని సభ నేపథ్యంలో సన్నాహక సమావేశంలో కామెంట్స్ చేశారు.

‘అధికారంలోకి రావడానికి మెట్టు దూరంలో ఉన్నాం’: ఎంపీ రఘునందన్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి మెట్టు దూరంలో ఉన్నామని, అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ప్రధాని సభ నేపథ్యంలో శనివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సన్నాహక కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని సభకు ప్రతి మండలం నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కష్టపడి పని చేస్తే మున్సిపల్ లో మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఓటు హక్కు లేని వారిని గుర్తించి వారికి కొత్తగా ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోలన్నారు. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, ప్రభారి రంజిత్ మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, విద్యాసాగర్, కనకయ్య, చింత సంతోష్, రాంరెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఉమారెడ్డి, విభీషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story