- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలన్నర కొడుకు సహా ఇద్దరు పిల్లల్ని చంపి.. తల్లి ఆత్మహత్య
by Naga Rani Yarlagadda |
నెలన్నర కొడుకు సహా.. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ లో జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నెలన్నర కొడుకు సహా.. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ లో జరిగింది. ప్రమీల (22)- సంగమేశ్వర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ధనుష్ (3), సూర్య వంశీ (నెలన్నర వయసు) ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రమీల మనస్తాపంతో ఇద్దరు పిల్లల్ని గొంతునులిమి చంపేసి.. ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ముగ్గురూ విగతజీవులుగా కనిపించడంతో పుట్టింటివారు, అత్తింటివారు తీవ్ర దుఃఖంతో కుమిలిపోతున్నారు. నాలుగు రోజుల క్రితమే సూర్యవంశీని ఊయలలో వేసే కార్యక్రమం నిర్వహించిన భర్త .. ఆమెను పుట్టింటికి పంపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






