- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడ్రన్ గా మెదక్ ఆర్టీసీ డిపో
మెదక్ ఆర్టీసీ బస్ డిపోను అద్భుతంగా మార్చి మోడ్రన్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు తెలిపారు.

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ ఆర్టీసీ బస్ డిపోను అద్భుతంగా మార్చి మడ్రన్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు తెలిపారు. గురువారం మెదక్ ఆర్టీసీ డిపో, బస్టాండ్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మెదక్ డిపోను మోడర్న్‌గా మార్చడంతో పాటు రామాయంపేట డిపోను ఎక్స్‌ప్రెస్ డిపోగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చల అనంతరం ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. డిపోను పరిశీలించిన అనంతరం ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ, బస్సులు, డ్రైవర్ల కొరత నివారణ, పాత బస్సుల స్థానంలో కొత్త మరియు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నాట్టు చెప్పారు. అలాగే రామాయంపేట బస్ స్టాండ్‌లో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా మరుగుదొడ్ల పునర్నిర్మాణ పనులు కూడా చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, కౌన్సిలర్ లు మన్‌సూర్, శివరామకృష్ణ, నాయకులు ఆవారి చంద్రశేఖర్, రాగి.అశోక్, బోజా పవన్, సది రాములు, మహ్మద్ సమీయుద్దీన్, బాలరాజ్ యాదవ్, సయ్యద్ ఉమర్ మొహియుద్దీన్, మెసన్ బిన్ అబ్దుల్లా, అబ్దుల్ సత్తార్, శంకర్ గౌడ్, ఎం బాలకృష్ణ పాల్గొన్నారు.






