జర్నలిస్ట్ కుటుంబానికి MLA రఘునందన్ రావు పరామర్శ

by Javid Pasha |
జర్నలిస్ట్ కుటుంబానికి MLA రఘునందన్ రావు పరామర్శ
X

దిశ, దుబ్బాక: దుబ్బాక మండలం రాజక్క పేట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ యాదగిరి కుమారుడు సాయి కుమార్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు యాదగిరి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.25 వేల ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు జర్నలిస్టు యాదగిరితో మాట్లాడుతూ మనోధైర్యాన్ని ఇచ్చాడు. అన్ని విధాల ఆదుకుంటానని యాదగిరికి యాదగిరికి హామీ ఇచ్చాడు. ఎమ్మెల్యే వెంట బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడు కిష్టమ్మ, సుభాష్ రెడ్డి, కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకోజీ ప్రవీణ్, కోండి ఎల్లారెడ్డి, రమేష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

READ MORE

తమ హక్కుల పరిరక్షణ కోసం జర్నలిస్టులు కృషి చేయాలి.. అల్లం నారాయణ

Next Story