- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల వేళ దిగొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
అల్లాదుర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలపై ఎట్టకేలకు ఎమ్మెల్యే స్పందించారు.

దిశ,అల్లాదుర్గం : అల్లాదుర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలపై ఎట్టకేలకు ఎమ్మెల్యే స్పందించారు. గత 44 రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడంతో గత రెండు రోజుల నుంచి జేఏసీ నాయకులు ఆమరణ నిరాహారదీక్షను చేపడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో, మండల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మంగళవారం దీక్ష శిబిరానికి చేరుకున్నారు. శిబిరంలోని ఆమరణ దీక్షను చేపడుతున్న జేఏసీ నాయకులతో మాట్లాడారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు
మంత్రి హరీష్ రావు స్పష్టమైన హామీ ఇచ్చారని, ఎన్నికల తర్వాత రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసుకుందామని, పలు ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించుకుందామని మంత్రి హామీనిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జేఏసీ నాయకుడు బ్రహ్మంకు నిమ్మరసం అందజేసి, దీక్షను విరమింపజేశారు. ఎట్టకేలకు తమ ప్రాంత చిరకాల కోరిక రెవెన్యూ డివిజన్ కోసం చేపట్టిన నిరాహార దీక్ష ఫలితంగా ఎమ్మెల్యే హామీతో జేఏసీ నాయకులు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా గత నెలరోజులకు పైగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం చేపడుతున్న దీక్ష శిబిరం ముందు నుంచే ఎన్నో పర్యాయవాలు ఎమ్మెల్యే వెళ్లినప్పటికీ ఆ వైపు కూడా కన్నెత్తి చూడలేదని, కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే శిబిరం వద్దకు వచ్చి హామీనిచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు.






