- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృధాగా పోతున్న తాగునీరు
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామానికి వెళ్లే రహదారి పక్కనే మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి నీళ్లు వృధాగా రైతుల పంట చేనులో పారుతున్నాయి.

దిశ, అల్లాదుర్గం: గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీరు అందక అవస్థలు ఎదుర్కొంటుంటే సంబంధిత అధికారుల నిర్లక్ష్య ధోరణికి నీళ్లు కాస్త వృధాగా పారుతున్నాయి ఈ భగీరథ నీళ్లు వృధాగాపారసాగి పక్షం రోజులు గడుస్తున్న అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవటం గమనార్హం. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామానికి వెళ్లే రహదారి పక్కనే మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి నీళ్లు వృధాగా రైతుల పంట చేనులో పారుతున్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటింటికి నిత్యం త్రాగునీళ్లు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తున్న నేపథ్యంలో కిందిస్థాయి అధికారుల విధి నిర్వహణ లోపంతో మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ కరువై ఈ పథకంపై పలు గ్రామాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ముప్పారం తాండకు వారానికి ఒకరోజు లేదా ఎప్పుడో ఒకసారి భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నారని తండావాసులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని దీంతో గ్రామాలకు నీటి కష్టాలు తప్పడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని, పగిలిన పైప్ లైన్‌కు మరమ్మతులు చేపట్టి, నీటి వృధాను అరికట్టలన్నారు. గ్రామానికి నిత్యం త్రాగునీళ్లు సరఫరా అయ్యే దిశగా కృషి చేయాలని అధికారులను కోరారు.






