మిషన్ భగీరథ పైపులైన్‌ లీకేజీ.. వృథాగా పోతున్న తాగునీరు

by Kodari Anjali |

కొండపాక మండలం రవీంద్రనగర్ గ్రామ పరిధిలో మిషన్ భగీరథ పైపులైన్ గేట్ వాలు పాడై వేల లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది.

మిషన్ భగీరథ పైపులైన్‌ లీకేజీ.. వృథాగా పోతున్న తాగునీరు
X

దిశ, కొండపాక: కొండపాక మండలం రవీంద్రనగర్ గ్రామ పరిధిలో మిషన్ భగీరథ పైపులైన్ గేట్ వాలు పాడై వేల లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. రహదారి పక్కనే ఉన్న పైపులైన్ కు భారీ రంధ్రం పడటంతో, నీరు ఫౌంటెన్ లాగా సుమారు 10 నుండి 15 అడుగుల ఎత్తుకు ఎగజిమ్ముతోంది. దీనివల్ల అటుగా వెళ్లే ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఎండలు మండిపోతూ, భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో ఇలా తాగునీరు వృథా కావడంపై స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీరు వృథాగా రోడ్డు పాలవుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని అరికట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Next Story