మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌పై దురుసు ప్ర‌వ‌ర్త‌న

by Nallavelli.Anjaneyulu |

మద్యం మత్తులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఓ వ్యక్తికి ఏడు రోజుల శిక్ష పడింది.

మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌పై దురుసు ప్ర‌వ‌ర్త‌న
X

దిశ, సంగారెడ్డి : మద్యం మత్తులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఓ వ్యక్తికి ఏడు రోజుల శిక్ష పడింది. ఈ ఘట‌న సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది.ఎస్సై న‌ర్సింహులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వైకుంఠపురం సమీపంలోని ఓ ఆటో డ్రైవర్ ఫూటుగా మద్యం సేవించి.. మ‌ద్యం మ‌త్తులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అతడిని కోర్టులో హాజరుపరచగా సంగారెడ్డి న్యాయ స్థానం అతడికి 7 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధించినట్లు పట్టణ ఎస్సై నర్సింహులు తెలిపారు.

Next Story