మాసంపల్లి వద్ద మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన

by Ratna Kumari |

అందోల్ మండలం మాసానిపల్లి వద్ద ఓ మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన చేసిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.

మాసంపల్లి వద్ద మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన
X
దిశ, ఆందోల్ : అందోల్ మండలం మాసానిపల్లి వద్ద ఓ మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన చేసిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవుల సందర్భంగా .. అల్మాయిపేటలోని తన అమ్మమ్మ ఇంటికి హత్నూర మండలం బడంపట నుంచి మైనర్ బాలిక వచ్చింది. తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు శనివారం మధ్యాహ్నం అల్మాయి పేట బస్సు స్టేజి వద్ద బాలిక బస్ కోసం వేచి చూస్తుంది. అదే సమయంలో చౌటాకూర్ గ్రామానికి చెందిన బైరుకమ్మరి మొగులయ్య తన బైక్ పై వస్తూ ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను చూసి బైకు ఆపాడు.

ఎక్కడికి వెళ్లాలి అంటూ మైనర్ బాలికను అడిగి జోగిపేట డ్రాప్ చేస్తానంటూ మైనర్ బాలికను నమ్మించి తన బైక్ పై ఎక్కించుకున్న మాసానిపల్లి సర్వీస్ రోడ్డు వైపు తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. భయంతో బైక్ పై నుంచి కిందకు దూకి తప్పించుకుంది. అక్కడే ఉన్న ఉపాధిహామీ కూలీలు గమనించి మైనర్ బాలికను కాపాడి, కిడ్నాప్ కు పాల్పడ్డ మొగులయ్య కు దేహశుద్ధి చేశారు. అనంతరం జోగిపేట పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై పాండు తన సిబ్బందితో అక్కడికి చేరుకొని మొగులయ్యను ఆధీనంలోకి తీసుకొని బాలికను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేప‌డుతున్నారు.
Next Story