సెప్టెంబర్ నెలలో సన్న వడ్లకు బోనస్ - మంత్రి వివేక్ వెంకటస్వామి

by velandi.Saikiran |   (  Updated:2025-08-20 15:11:01  IST  )

* అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు * సెప్టెంబర్ నెలలో సన్న వడ్లకు బోనస్

సెప్టెంబర్ నెలలో సన్న వడ్లకు బోనస్ - మంత్రి వివేక్ వెంకటస్వామి
X

దిశ, దుబ్బాక: ప్రజల అవసరాలను తీర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు కార్మిక గనుల శాఖ మంత్రి డా,వివేక్ వెంకటస్వామి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని చెప్పారు. ప్రతి కార్యకర్త రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసి ఓటు షేర్ పెంచుకోవడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. బుధవారం చెరుకు శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర మంత్రి కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రివర్యులు మాట్లాడుతూ ...ఖర్గే సభకు జనసమీకరణ అద్భుతంగా జరిగినట్లు అసెస్‌మెంట్ చేశామని, ఇప్పుడు ఇక్కడ కూడా పరిస్థితులను పూర్తిగా పరిశీలిస్తున్నామని తెలిపారు.పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్ రెడ్డికి ప్రోటోకాల్ కలిగేలా తగిన పదవులు ఇచ్చే దిశగా చూడనున్నట్టు హామీ ఇచ్చారు. సూచించారు.కార్యకర్తల ఆవేదనలను పూర్తిగా అర్థం చేసుకుంటామని, సమస్యలు ఉంటే వాటిని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు.ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు జరిగితే వెంటనే రాయాలని, అధికారుల ద్వారా ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదని స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, పదవులు వచ్చేలా తానే కృషి చేస్తానని హామీ ఇచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మంచి పేరు కలిగి ఉండటం కార్యకర్తలకు గొప్ప ఆస్తి అవుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మంచి పనులు చేసి ప్రజల ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ గ్రూపులు సహజమని, కానీ అవే బలం అవుతాయని, మన శక్తి మనం చూపాలని మంత్రివర్యులు ఉత్సాహపరిచారు.మనకు ఓట్లు వస్తే మనకు బలం వస్తుందని ఓట్లే మన బలం అని కార్యకర్తలకు ధైర్యం చెప్పి, సిద్దిపేట జిల్లాలో మూడు సీట్లు గెలిచే బేస్ ఇప్పుడు నుంచే సిద్ధం చేసుకోవాలని సూచించారు.వివాదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు వెళితే వచ్చే ఎన్నికల్లో విజయాలు ఖాయం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, కూడవెల్లి ఆలయ చైర్మన్ రాజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు కొంగరి రవి, పట్టణ అధ్యక్షుడు నర్మేట ఎసు రెడ్డి, పాతూరి వెంకటస్వామి గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story