- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేట జిల్లాలో హాట్ టాఫిక్‌గా మంత్రి పొంగులేటి ప్రకటన
సిద్దిపేట జిల్లాలో పొంగులేటి ప్రకటన దుమారం కొనసాగుతుంది. రాష్ట్రంలో జిల్లా పునర్ వ్యవస్థీకరణపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటననే తర్వాయి.

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట జిల్లాలో పొంగులేటి ప్రకటన దుమారం కొనసాగుతుంది. రాష్ట్రంలో జిల్లా పునర్ వ్యవస్థీకరణపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటననే తర్వాయి.. సిద్దిపేట జిల్లా పై కుట్రనా..? రాజకీయ కోణమా..? లేక పున వ్యవస్థీకరణ..? అని ప్రజలు విభిన్న వాదనలతో చర్చ కొనసాగుతున్న వేళ..! జిల్లాను తీసివేసే కుట్రలకు ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ నేతల ప్రకటన రాజకీయ వేడిని రాజేసింది. సిద్దిపేట ప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాంక్ష, పోరాట ఫలితంగా 11 అక్టోబర్ 2016 న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని కోహెడ, బెజ్జంకి, హుస్నాబాద్, జనగాం నియోజక వర్గ పరిధిలోని చేర్యాల, మద్దూరు మండలాలను కలుపు కొని 23 మండలాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటైంది.
ప్రత్యేక మండలాలు కోసం ప్రజలు ఉద్యమాలు చేయడంతో కుకునూరుపల్లి, అక్బర్ పేట భూంపల్లి, దుల్మిట్ల, మర్కుక్ మండలాలను ఏర్పాటు చేయడంతో మొత్తం 26 మండలాలతో జిల్లా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని మండల ప్రజలు చేపట్టిన ఉద్యమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మద్దతు పలికారు. అదే విధంగా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్ మండలాలు తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ లో పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కరీంనగర్ జిల్లాలో కలుపుతామని హామీనిచ్చారు.
వ్యూహాత్మకంగానే..?
హుస్నాబాద్ ప్రాంతంలోని మూడు మండలాలను కరీంనగర్ జిల్లాలో కలిపి, సిరిసిల్ల నియోజక వర్గాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఒక్క జిల్లా కే పరిమితం చేయాలనే వ్యూహం లో భాగంగానే పొంగులేటి ప్రకటన చేశారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. జిల్లా మంత్రి సైతం తన నియోజకవర్గాన్ని కరీంనగర్ లో కలపాలనే ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నట్టు చర్చ జోరుగా సాగుతోంది.
1982లో సిద్దిపేట జిల్లా ఆకాంక్షకు బీజం
సిద్దిపేట జిల్లా ఏర్పాటు ఆకాంక్షకు 1982 లో బీజం పడింది. స్వర్గీయ ఎన్ టీ ఆర్ సిద్దిపేట ప్రాంతానికి వచ్చిన సందర్భంగా సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్, రామాయంపేట ప్రాంతాలను కలిసి జిల్లా ఏర్పాటు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ కు ప్రతిపాదన తో వినతి పత్రం అందజేశారు. తదనంతరం దశాబ్దాలుగా జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఎన్నికల హామీ గానే మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో సిద్దిపేటకు వచ్చిన శ్రీ కృష్ణ కమిటీకి సిద్దిపేట జిల్లా ఫోరం ప్రతినిధులు సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం అందజేయడం తో పాటుగా వివిధ రూపాల్లో సిద్దిపేట జిల్లా ఫోరం ప్రతినిధులు ఉద్యమాన్ని కొనసాగించారు.
జిల్లా పునర్ వ్యవస్థీకరణ సహేతుకం కాదు
జిల్లా కేంద్రం నుంచి మారుమూల గ్రామానికి సైతం 30 నుంచి 50 కిలోమీటర్ల రెడియస్‌లో సిద్దిపేట జిల్లా విస్తరించి ఉండి ప్రజలకు అందుబాటులో ఉందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిన నేపథ్యంలో జిల్లా పునర్ వ్యవస్థీకరణ సహేతుకం కాదన్నారు - లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు






