వీర బ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి..

by Kodari Anjali |

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వీర బ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

వీర బ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి..
X

దిశ, రేగోడ్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మండల కేంద్రమైన రేగోడ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవాలలో శనివారం నాడు పాల్గొన్నారు. ఆలయ పూజారి శివకుమార్ చారి ఆధ్వర్యంలో మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు.

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

మండల కేంద్రంలో మంత్రి దామోదర్ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు అందోల్ మహేష్ కుటుంబ సభ్యులతో కలసి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలు సొంతింటిలో ఆత్మగౌరవంతో బతకాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తూ, వారికి సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పిసిసి సభ్యుడు కిషన్, డాక్టర్స్ సెల్ చైర్మన్ రాజీవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిగంబర్ రావు, సర్పంచ్ పర్విన్ చోటు మియా, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story