జనవరి 18 నుంచి 'కంటి వెలుగు' కార్యక్రమం ప్రారంభం : Minister Harish Rao

by Disha Web Desk 13 |
జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం : Minister Harish Rao
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నట్లుగా.. మీ కష్టాలు, ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని, కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించుకున్న దాదాపు 3 వందల మందికి మంత్రి హరీష్ రావు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జనవరి 18వ తేదీ నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని 3 వేల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించి, కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా శర్మ, డీఎంహెచ్‌వో కాశీనాథ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

READ MORE

అందుకే నాపై CBI దాడులు: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..

Next Story