డబుల్ ఇంజన్ పాలన దగా ముచ్చటే: బీజేపీపై Minister Harish Rao ఫైర్

by Disha Web |
డబుల్ ఇంజన్ పాలన దగా ముచ్చటే: బీజేపీపై Minister Harish Rao ఫైర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: బీజేపీ రాష్ట్రాల్లో వికలాంగులకు ఇచ్చే పింఛన్ రాష్ట్రంలో ఇచ్చే ఫించన్‌తో పోలిస్తే పదింతలు తక్కువ ఉందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రా ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సిద్దిపేట కొండ మల్లయ్య గార్డెన్‌లో మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హాజరై మాట్లాడారు. వికలాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొదటి బహుమతి అందించిందని గుర్తుచేశారు. దివ్యాంగుల పింఛన్ బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 వందల రూపాయలు కాగా.. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌తో రూ. 6వందలు అందిస్తున్నారని ఎద్దేవా చేశారు.

వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1700 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. దీనికి తోడు సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ఐదు శాతం, ఉద్యోగ అవకాశాలు 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యలో దివ్యాంగుల రిజర్వేషన్ పెంపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. దివ్యాంగుల వివాహానికి 2 లక్షల 25 వేల సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. తెలంగాణపై అవాక్కులు జవాక్కులు మాట్లాడే బీజేపీ నాయకులను ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తాలేరో ప్రశ్నించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ, అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, రాష్ట్ర వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ, స్త్రీ, శిశు సంక్షేమ, దివ్యాంగుల శాఖ జిల్లా అధికారి రామ్ గోపాల్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి. రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, వికలాంగుల రాష్ట్ర, జిల్లా బాధ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read more:

బండి సంజయ్‌కి పది రోజులు టైమ్ ఇస్తున్నా: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

Next Story

Most Viewed