- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందోలులో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ అందోలు నియోజకవర్గంలో పాదయాత్ర నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ బుధవారం అందోలులో పర్యటించారు.

దిశ,అందోల్: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ అందోలు నియోజకవర్గంలో పాదయాత్ర నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ బుధవారం అందోలులో పర్యటించారు. జోగిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మీనాక్షి నటరాజన్ పర్యటన, చేపట్టనున్న పాదయాత్ర, శ్రమదానం, కార్యకర్తల సమావేశం వంటి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై నాయకులతో చర్చించి, పలు సూచనలు, సలహాలను చేశారు.
మండల పరిధిలోని సంగుపేట వద్ద ఆగస్టు 1న సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభమవుతుందని, జోగిపేటలోని పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. దారి పొడవునా ప్లేక్సీలు, ఆర్చీలు, కమాన్‌లతో పాటు అక్కడక్కడ హైడ్రోజన్ బెలూన్‌లను ఏర్పాటు చేయాలన్నారు. పాదయాత్రలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్వచ్చందంగా తరలి రావాలని ఆయన సూచించారు. ఆగస్టు1వ తేదీన ఆమె జోగిపేటలోని డాక్టర్ అద్దంకి వీరన్న ఇంట్లో బస చేయనున్న సందర్భంగా ఆ ఇంటిని ఆయన పరిశీలించారు.
ఆగస్టు 2వ తేదీన ఉదయం పట్టణంలో పలు చోట్లలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించి, మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంగుపేట వద్దనున్న లక్ష్మీదేవి గార్డెన్స్‌లో కార్యకర్తలతో సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు. మీనాక్షి నటరాజన్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫేడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి, మాజీ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్‌లు డేవిడ్, రాములు, మాజీ కౌన్సిలర్‌లు ఎస్.సురేందర్ గౌడ్, రంగ సురేష్, ఎ.చిట్టిబాబు, పి. ప్రవీణ్‌కుమార్, డాకూరి శంకర్, నాని నాగరాజ్, పడిగె సత్యం, దుర్గేష్, చందర్, హరికృష్ణాగౌడ్, అక్సాన్‌పల్లి సోసైటీ చైర్మన్ జీఆర్.నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ హనుమండ్లు, నాయకులు గుర్రం కృష్ఫ. కొశికే రాజశేఖర్, ధనుంజయ్‌రెడ్డి, ప్రవీణ్, శివకుమార్, గోహెర్‌అలీ,యూత్ విభాగం నాయకులు వినయ్ గౌడ్, మల్లేశం, పృథ్వీరెడ్డి, చోటు, ఖాజాలతో పాటు తదితరులు పాల్గొన్నారు.






