- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారానికొకసారి వార్డుల్లో పర్యటిద్దాం: మంత్రి దామోదర్
అభివృద్ది, సంక్షేమం ప్రజలకు కనిపించాలని మంత్రి దామోదర్ అన్నారు.

దిశ, అందోల్: అందోలు–జోగిపేట మున్సిపాలిటీలో వారానికొకసారి స్వయంగా పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని పరిష్కరించుకుందామని రాష్ట్ర ౖÐð ద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం అందోలు–జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, ఆకుల చిట్టిబాబు, కౌన్సిలర్‌లు సంగారెడ్డిలోని మంత్రి నివాసానికి వేళ్లి కలిసారు. ఈ సందర్బంగా మున్సిపాలిటీ అభివృద్దిపై పలు అంశాలను వారితో చర్చించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమై నిధులను మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరసరం ఉందని, అర్హులైన వారికి పథకాలను వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకొవాలన్నారు.
కొంత మేరకు జాప్యం...
అదే విధంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను మున్సిపల్ పాలకవర్గం పరిశీలించాలని, స్థానికంగా జరుగుతున్న అభివృద్దిని ప్రజలకు తెలియజేయాలని వారికి చెప్పారు. పట్టణంలో 500 ఇందిరమ్మ ఇళ్ల వరకు నిర్మాణాలు జరిగాలని, ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారని మున్సిపల్ కమిషనర్ రవీందర్‌ను మంత్రి ప్రశ్నించగా 230 ఆన్‌లైన్ అయ్యాయని, ఆన్‌లైన్ సమస్యలు ఉత్పన్నమవుతుండడంతో కొంత మేరకు జాప్యం జరుగుతుందని కమిషనర్ వివరించారు. అజ్జమర్రి–జోగిపేట బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించాలని, ఈ పనులు పూర్తయినట్లయితే సుమారుగా 23 గ్రామాల ప్రజలు జోగిపేటకు వివిధ పనుల నిమిత్తం వచ్చే అవకాశం ఉంటుందని దీనివల్ల వ్యాపారాలు పెరిగి, స్థానిక వ్యాపారులకు జీవనోపాధి లభించనుందని మంత్రి వారికి తెలియజేసారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు.
సీల్డ్ కవర్‌లో కో ఆప్షన్ సభ్యుల పేర్లు:
జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించి నాలుగు కొ అప్షన్ స్థానాలకు గాను 10 మంది ఆశావాహులు తమ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ విషయంలో కో ఆప్షన్ సభ్యుల పేర్లతో కూడిన సిక్రెట్ సీల్డ్ కవర్ పంపిస్తానని పాలకవర్గ సభ్యులకు మంత్రి తెలిపారు. నేడు (మంగళవారం) మున్సిపల్ కార్యాలయంలో జరగబోయే కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి తాను సూచించిన వారికి ఆమోదం తెలుపాలని పాలకవర్గ సభ్యులకు సూచించారు. అన్ని విధాలుగా ఆలోచించే కొత్త కోఆప్షన్ సభ్యుల పేర్లను నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. కానీ వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.






