ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

by Bhanu |   (  Updated:2025-12-06 09:38:06  IST  )

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఆర్డీవో రమాదేవి నామినేషన్లు, గుర్తుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు. నిజాంపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను తనిఖీ చేశారు

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
X

దిశ, నిజాంపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఆర్డీవో రమాదేవి నామినేషన్లు, గుర్తుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు. నిజాంపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండో విడత ఎన్నికలను నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు గుర్తు కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీవో రాజీరెడ్డి తదితర అధికారులు ఉన్నారు.

Next Story