- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మెదక్ ఎంపీ
మండల పరిధిలోని చిన్న శివునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.

దిశ, చేగుంట: మండల పరిధిలోని చిన్న శివునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి, ఆరోగ్య శాఖ మంత్రికి రాని ఆలోచన కేవలం మన సీఎం కేసీఆర్ కు మాత్రమే రావడం, అది అమలుపరచడం గర్వకారణం అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం శివాలయాభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయల నిధులు, ఎస్సీ కమిటీ హాల్ కోసం ఐదు లక్షల రూపాయల నిధులు, గౌడ సంఘ భవన నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల నిధులతో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, స్థానిక సర్పంచ్ కొటారి అశోక్, ఎంపీటీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






