- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన మెదక్ ఎంపీ
అనారోగ్యంతో బాధపడుతున్న రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసు రెడ్డిని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. మండల పరిధిలోని పోలంపల్లి గ్రామంలోని

దిశ చేగుంట : అనారోగ్యంతో బాధపడుతున్న రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసు రెడ్డిని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. మండల పరిధిలోని పోలంపల్లి గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి నివాస గృహంలో అతని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రామాయంపేట నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు చేసిన వాసురెడ్డి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అనంతరం ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పొలం పల్లి గ్రామానికి చెందిన ర్యాపాకుల సతీష్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో సతీష్ గౌడ్ మృతి చెందడం బాధాకరమని, చిన్న వయసులోనే కుటుంబ సభ్యులకు దూరంగా తనను కలిసి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాయాన్ని అదే విధంగా తాను కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ పరామర్శల కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి వెంట చేగుంట జడ్పిటిసి శ్రీనివాస్, కర్నాల్ పల్లి ఎల్లమ్మలే కమిటీ చైర్మన్ జనగామ రామా గౌడ్, పార్టీ నాయకులు యాట సిద్ధిరాములు, సత్యం తో పాటు పలువురు పాల్గొన్నారు.






