ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి: మెదక్ ఎంపీ రఘునందన్ రావు

by Kodari Anjali |

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మెదక్ ఎంపీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ వేడుకలలో భాగంగా కామెంట్స్ చేశారు.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి: మెదక్ ఎంపీ రఘునందన్ రావు
X

దిశ, కొండపాక: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కుకునూర్ పల్లి మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం ఎంపీ రఘునందన్ రావు బీరప్ప స్వామి కామారాతి అమ్మ వార్లను దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో భక్తి భావం పెరగాలని, ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలిసిమెలిసి జీవించినప్పుడే గ్రామాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు అనుముల సంపత్ రెడ్డి, మాజీ సర్పంచ్ బోడపట్ల ఐలం శివ, బీజేపీ పార్టీ నాయకులు ముష్నం నాగరాజ్, సదానంద గౌడ్, కురుమ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.

Next Story