ఎంపీ రఘునందన్ రావు బంపర్ ఆఫర్.. వారికి రూ.25 లక్షలు

by Bhanu |

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే రూ.25 లక్షల నిధులు ఇప్పిస్తా అన్నారు.

ఎంపీ రఘునందన్ రావు బంపర్ ఆఫర్.. వారికి రూ.25 లక్షలు
X

దిశ, సిద్దిపేట: మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం ఎంపీ నిధులు నుంచి లేదా సీఎస్ ఆర్ కింద రూ.25 లక్షల నిధులు ఇప్పిస్తా అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిహాసం చేసే విధంగా సర్పంచ్ ఏకగ్రీవం కోసం వేలం పాటలు నిర్వహించడం దురదృష్టకరం అన్నారు. ఏకగ్రీవాలు అంబేద్కర్ స్పూర్తికి వ్యతిరేకం అన్నారు. గ్రామాల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు చేరేలా ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫీఎఫ్ డబ్బులు చెల్లించని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రానికి సంబంధించి రూ.3500 కోట్లు 15 ఆర్ధిక సంఘం నిధులు ఆగిపోయే పరిస్థితి నెలకున్న వేళ తప్పని పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలకు తెర లేపారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేస్తే నాయ పైస లాభం ఉండదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బయటకు రాడు.. మరో ఎమ్మెల్యే వ్యాపారం చేసుకుంటాడు.. మరో ఎమ్మెల్యే కు పేపర్ల ఫోటో కనబడకుంటే నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. ఇంచార్జి మంత్రి ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందన్నారు. ఎంపీ నిధుల్లో 65 శాతం నిధులు సిద్దిపేట జిల్లాలో ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్, నాయకులు వంగ రామ చంద్రారెడ్డి, బాసంగారి వెంకన్న, తొడుపునూరి వెంకటేశం, గోనే మార్కండేయలు, గుండ్ల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story